
యన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గోళ్ళమూడి గ్రామం
మంచి నీటి టాంకర్ ఎక్కడ
అధికార పార్టీకి తొత్తుగా మారిన గోళ్ళమూడి గ్రామ పంచాయితీ సెక్రెటరీ రాంజీ.
విజయవాడ MP .కేశినేని నాని గారి నిధులతో ప్రతి గ్రామానికి ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా ట్యాంకర్లు,అదేవిధంగా గోళ్ళమూడి గ్రామానికి కూడా ఏర్పాటు చేయటం జరిగింది
గ్రామంలోని మంచినీటి ట్యాంకర్ గత 10రోజులుగా కనిపించటం లేదు,గ్రామ ప్రజలు అవసరాల కొరకు పంచాయితీ సెక్రటరీని అడగగా, సెక్రటరీ నాకు తెలీదు అనే సమాధానం చెప్తున్నారు,
అసలు ట్యాంకర్ ఎం అయింది..?
ఎక్కడ ఉంది..?
ఏమీ తెలియక గ్రామ ప్రజలు ఫంక్షన్స్ చేసుకునే నిర్వాహకులు , చాలా ఇబ్బంది పడుతున్నారు,
ఈ సమస్యని గ్రామ ప్రజలు, గాడిపర్తి శ్రీనివాసరావు గారి దగ్గరకి తీసుకొచ్చారు , ఈ సమస్య పరిగణలోకి తీసుకున్న
గోళ్ళమూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అద్ధ్యక్షులు
గాడిపర్తి శ్రీనివాసరావు
ఈ విషయం పై చాలా తీవ్రంగా స్పందించారు .
అధికార పార్టీ కి చెందిన నేత ఒకరు మంచి నీటి టాంకర్ ను తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారని తన దృష్టికి వచ్చిందని తెలియజేశారు.
గోళ్ళమూడి పంచాయతీ సెక్రటరీ గారికి ఒకటే చెప్తున్నాం
గ్రామానికి సంబంధించిన ట్యాంకర్ మళ్ళీ గ్రామానికి తీసుకొని రావాలని గట్టి గా డిమాండ్ చేశారు. ,,
లేనిచో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి పిర్యాదు చేస్తామని తెలియపరిచారు.