ఎన్టీఆర్ జిల్లా నందిగామ
నందిగామ మండలం నందిగామ గ్రామ, రమణ కాలనీలో నివాసం ఉండే తమ్మవరపు గోపీ S/O త మ్మవరపు యేసు అను భవన నిర్మాణ కార్మికుడు అనాసాగరంలో భవన నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్తున్న సమయంలో అనాసాగరం నుండి రమణా కాలనీకి వెళ్లే బైపాస్ రోడ్డు మధ్యలో వాహనం పై నుండి అకస్మికంగా కిందపడి తల వెనుక భాగాన నుదుటిపైన తీవ్రమైన గాయాలై ఆకస్మిక మరణం చెందడం జరిగింది
తమ్మవరపు గోపి జనసేన పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఎప్పుడు ఎక్కడ జనసేన పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జరిగిన తను క్రియాశీలకంగా పాల్గొంటూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుమేరకు జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న సమయంలో తమ్మవరపు గోపి ఇలా ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మరణించడం జనసేనకి తీరని లోటు అని జనసేన క్రియాశీలక సభ్యత్వం తరఫున జనసేన పార్టీ అన్ని విధాల వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటదని ఎల్లవేళలా జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండదండగా ఉంటదని నందిగామ 20వ వార్డు కౌన్సిలర్ వెంకటకృష్ణ,, నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పూజారి రాజేష్ విచారణ వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నందిగామలో భవన నిర్మాణ కార్మికుడు మృతి
RELATED ARTICLES