TEJA NEWS TV :ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన “స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమం నందిగామ ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ కె. బాలకృష్ణ గారు పాల్గొన్నారు.
ఆర్డీఓ గారు మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యం మరియు కుటుంబ సుస్థిరత సమాజ అభివృద్ధికి కీలకమని, ఇటువంటి ఆరోగ్య శిబిరాలు ప్రజలకు మేలుకలిగిస్తాయని పేర్కొన్నారు. కుటుంబ ఆరోగ్యం ప్రధానంగా ఆడవారి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆరోగ్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ లోవరాజు గారు, మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణ కుమారి గారు, హాస్పటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు గారు, ఇంచార్జ్ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ సీతారావమ్మ, ఆర్.ఎం.ఓ రమేష్, డాక్టర్ సింధూర, సంధ్య, సంపత్, మౌనిష్ తదితరులు పాల్గొన్నారు. హాస్పటల్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.




