ఎన్టీఆర్ జిల్లా నందిగామ
మహా శివరాత్రి సందర్భంగా ఎన్టీఆర్ జిల్ల నందిగామ మండలం దాములూరు – కూడలి గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం లో దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు నిర్వహించు కునేందుకు కూడలి వద్ద మంగళవారం సర్పంచ్ గాదెల రామారావు వారి ఆధ్వర్యం లో గ్రామ కార్యదర్శి జీవన జ్యోతి 3,36000 రూ.,, యలకు బహిరంగ వేలం పాటలు నిర్వహించారు.
మహా శివరాత్రి సందర్భంగా నాలుగు రోజుల పాటు జరిగే తిరునాళ్ళకు సంబంధించి ఆలయ సమీపం లో గ్రామపంచాయతీ ఆధ్వర్యం లో మిఠాయి , బొమ్మల షాపులు , కొబ్బరికాయలు , పూజా ద్రవ్యాలు, గాజులు, స్టీలు సామాను, పలు రకాల ఇతర వ్యాపారాలకు సంబంధించిన దుకాణాల సముదాయాలు ఏర్పాటు చేసుకుని అమ్ముకునేందుకు మంగళవారం రోజున ఈ బహిరంగ వేలం పాటలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ గాదెల రామారావు, గ్రామ కార్యదర్శి జీవన జ్యోతి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు….
నందిగామ:దుకాణాల ఏర్పాటు కోసం వేలం పాటలు
RELATED ARTICLES