Monday, February 10, 2025

నందిగామ:క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

TEJA NEWS TV: యన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గోళ్ళముడి లో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన టిడిపి. జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య*_

జగ్గయ్యపేట నియోజకవర్గం,నందిగామ మండలం, గోళ్ళముడి గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాడిపర్తి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో NTR & CBN జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో తెదేపా శ్రేణులతో కలిసి ముఖ్యఅతిథిగా టిడిపి జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసి టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రికెట్ పోటీలను నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో ఉత్సాహం కల్పించడానికి సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ పోటీలను 2 నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించిన గాడిపర్తి శ్రీనివాసరావు గారిని మరియు టోర్నమెంట్ కమిటీ సభ్యులను తాతయ్య అభినందించారు.

ఈ కార్యక్రమంలో తోట నాగమల్లేశ్వరరావు, గాడిపర్తి శ్రీనివాసరావు, బత్తిన రవి, చెరుకూరు హైమారావు, లగడపాటి బాబి, చావా అర్జునరావు, కటారపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular