TEJA NEWS TV : ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
కులమత బేధం లేని మహనీయుడు శ్రీ వంగవీటి రంగా
శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ టౌన్ :
గురువారం నాడు నందిగామ పట్టణం అనాసాగరం గ్రామం నందు ఎన్డీఏ కూటమినేతలతో కలిసి స్వర్గీయ వంగవీటి రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జయంతి వేడుకలలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ..
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల కోసం తన ప్రాణాలు అర్పించిన మహానుభావుడు వంగవీటి రంగా గారు
ఆ తరానికి దైర్యం, ఈ తరానికి మార్గదర్శం, రేపటి తరానికి ఆదర్శం, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బెజవాడ బెబ్బులి స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు అని ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య తెలియజేశారు.