సంగెం మండలము చింతలపల్లి గ్రామంలో ఝాన్సీ లక్ష్మిభాయి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని రకాల వసతులు కల్పించామని అన్నారు. అలాగే సంగెం మండల రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని,రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు,ఏ గ్రేడ్‌కు రూ. 2320, కామన్ రకానికి రూ.2300 ధర చెల్లిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17% మాయుచర్ ఉండాలి అని అన్నారు,కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే సన్నధాన్యానికి బోనస్ లభిస్తుందన్నారు. రైస్ మిల్లులో విక్రయాలకు బోనస్ వర్తించదని ప్రతి ఒక్క రైతుకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలికసదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రవాణ, హమాలీలు, గోనె సంచుల కొరత రాకుండా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సొల్లేటి మాధవరెడ్డి మాజీ ఎంపీపీ కందకట్ల కళావతి నరహరి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
RELATED ARTICLES