శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు,హెల్పర్ లు ఈ రోజు విజయవాడలో తలపెట్టిన ధర్నాకు వెళుతున్న సమయంలో ఒన్ టౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్లు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,కనీస వేతనం ఇరవై ఆరువేల రూపాయలు ఇవ్వాలని, ఎఫ్ ఆర్ ఎస్ యాప్ ను రద్దుచేసి,పనిబారాలు తగ్గించాలని, మెనూ చార్జీలు పెంచాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లు గా గుర్తించాలని మరియు వివిధ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ, ధర్నా నిర్వహించడానికి వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
ధర్నాకు వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
RELATED ARTICLES