*నంద్యాల జిల్లా :-*
*ఆళ్లగడ్డ మండలం 7-9-24 తేదీ శనివారం రాత్రి సుమారు 12:45 గంటలకు పేరాయిపల్లి మెట్ట దగ్గర ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఐచర్ ఆల్విన్ లారీ తల్లీ కొడుకు మృతి*
సికింద్రాబాద్ నుండి వినాయక చవితి పండుగ నిమిత్తం కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లె గ్రామానికి బయలుదేరి వెళుతున్న గాజుల కాంతమ్మ వయసు 38 సం” మరియు కొడుకు జగదీశ్వర్ రెడ్డి వయసు 17 సం” మరియు వీళ్ల ఇంటి ప్రక్కన సికింద్రాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న మేడిశెట్టి వెంకట సుబ్బారావు వయసు 42 సం” ముగ్గురు కలిసి బైక్ మీద సికింద్రాబాద్ నుండి బయలుదేరి నందిపల్లె వెళుతుండగా పేరెయిపల్లి మెట్ట వద్ద టీ తాగి బయలుదేరి హైవే మీదకు రాగానే పెబ్బేరు నుండి అరటికాయల లోడు కోసం రాజంపేట వెళుతున్న ఐచర్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టగా అక్కడికక్కడే జగదీశ్వర్ రెడ్డి మృతి చెందాగా ఆళ్లగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కాంతమ్మ మృతి చెందినది సమాచారం అందిన వెంటనే ఆళ్లగడ్డ రూరల్ Si K. హరిప్రసాద్ గారు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించి ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టినారు
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ – తల్లీ కొడుకు మృతి
RELATED ARTICLES