TEJA NEWS TV: హొళగుంద మండల కేంద్రంలోని ఆలూర్ తాలూకా కర్నూలు జిల్లా
నేరణికి గ్రామం కొండ గుహలో వెలసిన మాళ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ
మీకు అందరికీ తెలుసు బన్నీ ఉత్సవాల గురించి ఆచార వ్యవహారాల అందరు గౌరవించుకోవాలి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుపబడే దసరా బన్నీ ఉత్సవాలు భాగంగా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రశాంతంగా జరుపు కోవాలని మన ఆచారాలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన కర్రల వద్దు సంప్రదాయంతో భక్తితో నడుచుకోవాలని వారు ప్రజలకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈనెల దసరా ఉత్సవాల సందర్భంగా 24వ తారీకు రాత్రి జరుగు మాళ మల్లేశ్వర స్వామి కళ్యాణ సందర్భంగా జరుగు బన్నీ ఉత్సవాలు రాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా దాదాపు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అందుకు కావాల్సిన ఏర్పాట్లును చేస్తున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని గాయాలు పాలు కాకూడదని నా భావం మల్లేశ్వరుని ఆమె కోరుకుంటున్నానని వారు తెలిపారు. అలాగే జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంస్కృత సంప్రదాయాలను గౌరవించాలని అదే సమయంలో ఇతర బాధపెట్టే విధంగా ప్రవర్తించరాదని వారు తెలిపారు. ఈసారి బన్ని ఉత్సవాలకు దాదాపు 100 సీసీ కెమెరాలు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నామని అలాగే ఐదు అంబులెన్స్ ఏర్పాటు. చేస్తున్నామన్నారు అగ్నిమాపక యంత్రాలు.ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఇక్కడ విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. బన్నీ ఉత్సవాలకు ఏర్పాటు చేస్తున్నామని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ బన్నీ ఉత్సవాలు ఏర్పాట్ల సందర్భంగా ప్రసాద్ ప్రసంగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని వసతులు ఏర్పాట్లు పూర్తిచేసుకున్నామని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు లైట్లు జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నాము అలాగే తాగునీరు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు పరిసరాల గ్రామంలో ఈ ఉత్సవాలలో మద్యాన్ని వాడకుండా చర్యలు తీసుకుంటామని. అలాగే కర్రలు సంప్రదాయ బద్ధంగా క్రమశిక్షణతో ఉత్సవాలు నడుపుకోవాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు. పోలీస్ సిబ్బంది. తదితర డిపార్ట్మెంట్ వారు పాల్గొనడం జరిగింది.
దేవరగట్టు బన్నీ ఉత్సవాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన సమీక్ష
RELATED ARTICLES