తేజ న్యూస్ టివి ప్రతినిధి
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక…. సగటు తెలంగాణ ఆడపడుచుకు ఇంతకంటే పెద్ద పండగ ఏదీ లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను దేవతగా కొలిచే అరుదైన పండుగ. తీరొక్క పూలను తెచ్చి.. అందంగా పేర్చి.. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో ప్రకృతిని, పూలను పూజించే గొప్ప పండుగ.
నేడు బతుకమ్మ పండుగలో చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్బంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య స్వయంగా బతుకమ్మ ను పేర్చారు. తెలంగాణ ఆడపడుచులందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ సంతోషకరమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
దేవతగా కొలిచే అరుదైన పండుగ బంగారు తల్లి బతుకమ్మ పండుగ -ఎంపీ డా. కడియం కావ్య
RELATED ARTICLES