Saturday, December 13, 2025

దృశ్యం సినిమా చూసి అల్లుడు పథకం.. అత్త హత్య

TEJA NEWS TV

సిద్దిపేట, దృశ్యం సినిమాలో మాదిరి నేరం చేసి తప్పించుకోవాలని నిర్ణయించుకున్న అల్లుడు ఒక మాస్టర్ ప్లాన్ వేసి వికలాంగురాలులైన సొంత అత్తను హత్య చేయించాడు.

ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. పోలీస్ కమిషనర్ డా. అనురాధ తెలిపిన వివరాల ప్రకారం… తొగుట మండలం పెద్ద మాసం పల్లి గ్రామానికి చెందిన తాళ్ల వెంకటేష్ పౌల్ట్రీ ఫారం పెట్టి వ్యవసాయం చేయగా రూ.22 లక్షల వరకు నష్టం వచ్చింది. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న తాళ్ల వెంకటేష్ సొంత అత్తమ్మను చంపి రోడ్డు ప్రమాదంలో మరణించిందని నమ్మించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని పథకం పన్నాడు. ఈ మేరకు కేసీఆర్ నగర్ లో నివాసం ఉంటున్న స్వంత అత్తమ్మ తాటికొండ రామవ్వ పేరిట పోస్ట్ ఆఫీస్ లో రూ.15 లక్షల ఇన్సూరెన్స్, ఎస్ బీఐ బ్యాంకులో రూ.40 లక్షల యాక్సిడెంట్ పాలసీ చేయించాడు.

ఈ విషయం స్నేహితుడు తాళ్ల కరుణాకర్ కు చెప్పాడు. ఈ విషయంలో సహాయం చేస్తే తనకు అప్పు ఉన్న రూ.1 లక్ష 30 వేలు ఇవ్వనవసరం లేదని, ఇన్సూరెన్స్ డబ్బులు సమానంగా పంచుకుందాం అని చెప్పగా కరుణాకర్ ఒప్పుకున్నాడు. అదే విధంగా కరుణాకర్ తండ్రికి మాయ మాటలు చెప్పి తండ్రి పేరిట ఉన్న 28 గుంట భూమిని సైతం రైతు బీమా డబ్బుల కోసం రామవ్వ పేరిట చేపించాడు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన తాటికొండ రామవ్వను పెద్దమాసన్ పల్లికి తీసుకొస్తున్నట్లు వెంకటేష్ వాట్సాప్ కాల్ ద్వారా కరుణాకర్ కు సమాచారం ఇచ్చాడు. పథకం ప్రకారం వెహికల్ అద్దెకు తీసుకొని తుక్కాపూర్ వద్ద వేచి ఉండాలని సూచించాడు.

థార్ వాహనం అద్దెకు తీసుకొని వేచి ఉన్న కరుణాకర్ కు తాళ్ల వెంకటేష్ వాట్సాప్ కాల్ చేసి అత్తమ్మను భూమి వద్ద రోడ్డు పైన కూర్చోబెట్టి పొలంలోకి వెళ్లినట్లు చెప్పి వాహనం తో గుద్ది చంపేయాలని సూచించాడు. కరుణాకర్ థార్ వెహికల్ వేగంగా నడుపుకుంటూ వచ్చి రోడ్డు పక్కన కూర్చున్న రామవ్వను గుద్ది వెళ్లిపోయాడు. తదనంతరం కరుణాకర్ సమాచారం వెంకటేష్ కు అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న వెంకటేష్ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తన అత్తమ్మ చనిపోయిందని డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన తొగుట పోలీసులు దర్యాప్తు లో భాగంగా కూపి లాగగా డబ్బుల కోసమే అత్త హత్యకు పథకం పన్నినట్లు తాళ్ల వెంకటేష్ ఒప్పుకున్నట్లు సీపీ అనురాధ తెలిపారు. కేసు ఛేదించిన తొగుట సీఐ లతీఫ్, ఎస్ ఐ రవికాంత్ రావు ను సీపీ అభినందించి రివార్డు అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular