కసాయి అనే పదము కూడా సిగ్గు పడేలా కన్న తండ్రే కాలయముడై ముక్కుపచ్చలారని మూడేళ్ల పసికందును కర్కషంగా గొంతు కోసి చంపాడు ఒక దుర్మార్గపు తండ్రి. అభం శుభం తెలియని ఆ వయసులో బుడిబుడి అడుగులతో తండ్రి గుండెలపై ఆడుకోవలసిన ఆ పసికందు పట్ల సొంత తండ్రి యమగాతుకుడైపోయాడు. సొంత కూతురిని ఒక తండ్రి సైకోగా మారి చిన్నారి జీవితాన్ని చిదివేసిన ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం జంపపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే జంపాపురం గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన శాంతకుమార్, ఆశీర్వాదమ్మ అలియాస్ కున్నెమ్మ దంపతులకు ఒక్కగానొక్క కూతురు వర్షిణి 3 సంవత్సరాల వయసు గల పాప ఇంట్లోని మంచం పై నిద్రపోయింది. తల్లి కున్నెమ్మ పక్కలో నిద్ర పోతున్న పాపను సైకో గా మారిన తండ్రి శాంత కుమార్ ఇంట్లో మంచం పై నిద్రిస్తున్న చిన్నారిని గొంతు కోసి ఇంటి వెనకాల వేలాడ దీశాడని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. ముక్కుపచ్చలారని చిన్నారి మృతదేహాన్ని చూసి గ్రామస్తులు బంధువులు పెద్ద ఎత్తున వినిపిస్తున్న తీరు చూపరులను కంటతడి పట్టించింది. చిన్నారి మృతితో జంపపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
దుర్మార్గపు తండ్రి చేతిలో చిన్నారి బలి
RELATED ARTICLES