గత ఐదేళ్ళలో పేరుకు ప్రజాపాలన.. కానీ చేసింది మాత్రం ప్రజల సొమ్మును దోచుకోవడం.. అని నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఆదివారం నందిగామ పట్టణం 16వ వార్డులో శ్రీ కనకదుర్గమ్మ తల్లి బోనాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, వైసీపీ పార్టీ అవసరాల కోసం ప్రభుత్వ భూములను చవకగా కొట్టేసి.. నిబంధనలు పాటించకుండా పార్టీ కార్యాలయాలను నిర్మాణం చేయడం.. ఇది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజాపాలన మాటున జరిగిందని మండిపడ్డారు. దుర్గమ్మ ఆగ్రహంతో వైసీపీకి అధికారం దూరమై, రాష్ట్రంలో రాక్షసుడి రాక్షస పాలన పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, పట్టణ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
దుర్గమ్మ ఆగ్రహంతో వైసీపీకి అధికారం దూరం
RELATED ARTICLES