నివాస ప్రాంతాలలో దాచిన టపాసుల స్టాక్ పాయింట్లల పరిస్థితి ఏంటి
నివాస ప్రాంతాల వద్ద భారీ ఎత్తున స్టాక్ పాయింట్లు ఏర్పాటు
ప్రమాదం సంభవిస్తే భారీ స్థాయిలో ప్రాణా నష్టం జరుగుతుందని ప్రజలు ఆందోళన
తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం
మండల కేంద్రమైన ఒంటిమిట్టలో దీపావళి పండుగ సందర్భంగా
టపాసులు అమ్మేందుకు తాత్కాలిక లైసెన్సులు ఇచ్చి నియమ నిబంధనలు అప్రమత్తత
తెలిపిన ఫైర్, మరియు పోలీసు అధికారులు నివాస ప్రాంతాలలో భారీ ఎత్తున (దీపావళి పండుగకు ముందు పండుగ తర్వాత)
నిలువ ఉంచిన మందు గుండు సామాగ్రి పరిస్థితి ఏంటి అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు, ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎంత మంది ప్రాణాలు
గాలిలో కలుస్తాయో అన్న ఆలోచన ప్రతి ఒక్కరిని కలవరపరుస్తుంది వ్యాపారులు స్వార్థం వారి లాభాల కోసం
ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఒకేసారి (టపాసులు)మందు గుండు సామాగ్రి తెప్పించి నిల్వ ఉంచడం
పరిపాటిగా మారిందని చెప్పవచ్చు ఈ ప్రాంతంలోఒక దీపావళి పండగే కాదు బ్రహ్మోత్సవాలు
,మొదలు పండుగలు,ఫంక్షన్లో, ఇటీవల ఎన్నికలు దగ్గర పడడంతోరాజకీయ నాయకుల రాకపోకలు
,అనేక ప్రోగ్రాములు,సంవత్సరం పొడుగునా జరిగే ప్రతి కార్యక్రమానికి టపాసులు కాల్చడం ఆనవాయితీగా
మారింది ప్రజల అవసరాలను బట్టి కొనుగోలుదారులకు అందుబాటులో బాణాసంచా ఉంచి అధిక ధరలకు అమ్మకాలు
సాగిస్తూ వ్యాపారులు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు
నివాస ప్రాంతాలలో ఉన్న ప్రజల భద్రతాపరమైన చర్యలు గాలికి వదిలేసి న వీరు నివాస ప్రాంతాల మధ్యలో భారీ ఎత్తున టపాసులు
నిల్వ ఉంచడం పై సర్వత్ర ప్రజల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి అని చెప్పవచ్చు ఇప్పటికైనా అధికారులు
దాడులు చేసి టపాసుల స్టాక్ పాయింట్లు నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచి ప్రజల ఆస్తులు ప్రాణాలక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత
ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.
దీపావళికి టపాసులు అమ్మేటప్పుడు అప్రమత్తత సరే???
RELATED ARTICLES