TEJA NEWS TV DHONE
నంద్యాల కర్నూల్ జిల్లా ల దివ్యంగుల సంఘాల జెఏసి పిలుపు మేరకు కర్నూల్ లోని ఎస్టీబీసీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 29 జరిగే ధివ్యంగుల మాహా సభకు దివ్యంగులు లక్షలాది మంది గా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరుతూ డోన్ పట్టణంలోని పురపాలక సంఘం ఆవరణంలో కర్నూలు నంద్యాల జిల్లాల దివ్యాంగుల సంఘాల జేఏసీ కార్యనిర్వాహక కార్యదర్శి శివశంకర్,పల్లవి మండల దివ్యాంగుల సమాఖ్య నాయకులు వాసుదేవుడు లా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తూ వారి హక్కులను చట్టాలను రిజర్వేషన్లను అమలు చేయడంలో అలసత్వం వహించాయని దీనిని నిరసిస్తూ ఈనెల 29వ తేదీన కర్నూల్ లోని ఎస్టీ బీసీ కళాశాల ప్రాంగణంలో వేలాదిమంది దివ్యాంగులతో సింహ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని ప్రతి దివ్యాంగులు పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లవి మండల దివ్యాంగుల సమైక్య కార్యవర్గ సభ్యులు పెద్దన్న బిడ్డ రెడ్డి గుమ్మకొండ రవి మహబూబ్ బాషా మధు నరేష్ వెంకటేష్ ఆచారి రాజేశ్వరి ఇతర దివ్యాంగులు పాల్గొన్నారు.
దివ్యంగుల సింహ గర్జనను విజయవంతం చేయండి
RELATED ARTICLES