తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలంలోని ముమ్మిడివరం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గ్రామంలో ప్రభుత్వ భూమి లేనందున అదే గ్రామానికి చెందిన దామెరుప్పుల రాజేష్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి తమ స్వంత భూమిని మనస్ఫూర్తిగా విరాళం ఇవ్వడం జరిగింది.విషయం తెలిసిన పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హనుమకొండలోని వారి నివాసంలో స్వంత ఊరుకు తనవంతుగా ఏదైనా చేయాలని సంకల్పించి గొప్ప మనసుతో రెండున్నర గుంటల భూమిని(సుమారు 10 లక్షల విలువ) తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంతో కీ.శే.దామెరుప్పుల సారయ్య – ఊర్మిళ పేర్లతో
గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి విరాళంగా ఇచ్చినందుకు అభినందిస్తూ శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దామెరుప్పుల రాజేష్ ను ఘనంగా సన్మానించిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..
RELATED ARTICLES



