ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
వీరులపాడు మండలం : బుధవారం నాడు వీరులపాడు మండలం దాచవరం గ్రామం నందు విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు తంగిరాల సౌమ్య
అనంతరం దాచవరం మల్నీడి పిచ్చయ్య గారి జ్ఞాపకార్థంతో వారి మనవడు శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన నూతన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రగతికి పల్లెలే పట్టు కొమ్మలు అని గాంధీ గారు అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అని. నాడు చంద్రబాబు గారు జన్మభూమి పేరుతో ప్రజలను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో ఇలా సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చే దాతలకు కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని అన్నారు గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి ముందుకు వచ్చిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి సన్మానించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య….