వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దసరా వేడుకలలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం సంతోషంగా ఉంది – కార్పొరేటర్.
వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని ధర్మారం, గరీబ్ నగర్ లలో జరిగిన దసరా ఉత్సవాల్లో గ్రామ పెద్దలతో కలసి పాల్గొన్న 16వ డివిజన్ *కార్పొరేటర్ సుంకరి.మనీషా శివకుమార్,
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ విజయదశమి పండగ ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు కలుగ చేయాలని అన్నారు. గ్రామస్థులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియచేశారు.ధర్మారం లో దసరా ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తయ్యాయని,గరీబ్ నగర్ లో భారీ వర్షంలోనూ ఆనందోత్సాహాల మధ్య గ్రామ ప్రజలంతా కలిసి జరుపుకోవడం పట్ల సంతోషాన్నిచ్చింది అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామాల పెద్దలు, కుల సంఘాల పెద్దలు,మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాల్లో పాల్గొన్న కార్పొరేటర్,సుంకరి, మనిషా శివకుమార్
RELATED ARTICLES