Wednesday, January 22, 2025

దళిత జాతి లబ్ధి పొందాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే – డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

తేజ న్యూస్ టివి ప్రతినిధి

హనుమకొండ జిల్లా : మాదిగ హక్కుల దండోరా రాష్ట్రస్థాయి సమావేశం హనుమకొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు సునీల్ అధ్యక్షతన వివిధ జిల్లాల నుండి వచ్చిన రాష్ట్ర నాయకులు హాజరు కావడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణను మాదిగ హక్కుల దండోరా నాయకులందరూ ఘనంగా సన్మానించడం జరిగింది. డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ మాట్లాడుతూ మాదిగ హక్కుల దండోరా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మరియు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సునీల్ టీం పనిచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. గడిచిన దశాబ్దాలు చూసుకుంటే మాదిగల కోసం నిలబడింది కాంగ్రెస్ పార్టీ. మనువాద బిజెపి పార్టీ ఎప్పుడు దూరం పెట్టింది , టిఆర్ఎస్ మోసం చేసింది ఇది ప్రజలందరికీ తెలుసు . కావున మాదిగలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ పక్షాన కోటి జనాభా గల మాదిగలందరూ కూడా నిలబడి ముఖ్యమంత్రి రేవంతన్న, ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహదారు వేమన్న మంత్రులు ఎమ్మెల్యే ల ఆధ్వర్యంలో రాష్ట్రమంతా రాష్ట్రస్థాయి నాయకులు పనిచేసే ప్రతి అభ్యర్థి గెలుపులో కీలకపాత్ర పోషించి, అర్హులైన మాదిగ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వివిధ రాజకీయ నాయకులుగా ఎదిగి పేద ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేసి కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి సోనియమ్మ ఆశీస్సులు తీసుకోవాలని డాక్టర్ రామకృష్ణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు మాదిగలకు భూమి ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది ,ప్రియంబర్స్మెంట్ ద్వారా చదువు ఇచ్చింది ఉద్యోగాలు కూడా ఇచ్చింది. ఎక్కువగా దళితులే గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు. పెద్ద జబ్బు వస్తే తట్టుకోలేరని అన్ని రకాలుగా మాదిగలను పేద వర్గాలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ ఇచ్చి మన ఆరోగ్యం కాపాడుతుంది. ఎక్కువగా మాదిగలు లబ్ధి పొందాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాబట్టి మాదిగలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా పనిచేసి దళిత నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలి వచ్చే ఐదేళ్లలో పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలని ఉద్దేశంతో లక్షంతో అన్ని రాష్ట్రాలలో కూడా దళిత నాయకులను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి పని చేయాలని డాక్టర్ రామకృష్ణ కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ సంఘల రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular