TEJA NEWS TV : దళిత అభివృద్ధి శాఖకు మంత్రిని కేటాయించాలి.
దళిత, గిరిజనులకు అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలి.
మాలమహానాడు జిల్లా అధ్యక్షులు సాధు నర్సింగారావు.
దళిత గిరిజనుల సమగ్ర అభివృద్ధిపై రెండు రోజులు అసెంబ్లీలో చర్చించి కాంగ్రెస్ చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం దళిత గిరిజనులకు ఇచ్చిన హామీ ప్రకారం అంబేద్కర్ అభయ హస్తం 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని యుద్ధ ప్రాతిపదికన అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే దళిత అభివృద్ధి శాఖకు వెంటనే మంత్రిని నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల కేటాయింపు చట్టం 2017 దళితుల జనాభా 18 శాతం ప్రకారం నిధులు కేటాయించాలని కోరుతున్నాము. దళితుల సంక్షేమం, అభివృద్ధి, రక్షణలను అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఎస్సీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలన్నారు ఎస్సీ అభివృద్ధి శాఖకు మరియు ఎస్సీ గురుకుల సొసైటీలకు తగినన్ని నిధులను కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.