కోడి కత్తి శ్రీనుకు బెయిల్ ఇస్తారా విచారణ జరుపుతారా..?
దళితులంటే జైలల్లో మగ్గాల్సిందేనా..?డాబా రమేష్
దళితులు నేరం చేశారో లేదో తెలియదు కానీ ఏళ్ల తరబడి జైలలో మగ్గిపోతున్నారని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ మండల అధ్యక్షుడు డాబా రమేష్ మండిపడ్డారు.ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి గారి పిలుపు మేరకు బుధవారం కంబదూరు మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలతో ఐదేళ్లగా జైళ్లలో మగ్గిపోతున్న కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనుకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని లేదంటే విచారణ వేగవంతమైన జరగాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..అత్యంత కట్టదిట్టమైన భద్రత నిఘా పరివేక్షణలోని విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి జరిగిందంటూ చెపుతున్నారు. వందలాది మంది సమక్షంలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండగా దాడి చేసిన నిందితున్ని గుర్తించినప్పుడు కోర్టులో సాక్ష్యం ఎందుకు చెప్పలేకపోతున్నారని స్వయాన ముఖ్యమంత్రి నిజాలను కోర్టుకు తేలేయపరచలేకపోవడం వెనక ఉన్న మర్మమేమిటో అర్థం కావడం లేదన్నారు.దళితుడైన శ్రీనివాసరావుకు ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేదని రాజకీయ కోణంలోనే శ్రీను బలి పశువు చేశారని వాపోయారు.బహిరంగ ప్రదేశంలో మీ పైన దాడి ఎవరు చేశారో మీరు చూసి కూడా ఎందుకు కోర్టుకు సాక్ష్యం చెప్పలేకపోతున్నారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాలయాపన చేయడంలో అనేక అనుమానాలకు తావిస్తొందన్నారు. ఐదు ఏళ్లగా జైలులో శ్రీను అనేకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 18 నెలల కాలం పాటు జైలు జీవితం గడిపారని బెయిల్ మీదనే బయటకు రావడం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 56 రోజులు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చారు.దళితులు మాత్రం నేరాలు రుజువు కాక పోయిన ఏళ్ల తరబడి సత్యం బాబు,శ్రీను లాంటి యువకులు నలిగిపోతున్నారని ఆవేదన చెందారు. నేరం చేసిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులే కాకపోతే బలవంతులకు ఒక న్యాయం బలహీనులకు మరో న్యాయంగా చూడటం అన్యాయమన్నారు.శ్రీను ఎలాంటి నేరం చేశారో కోర్టు ద్వారా సాక్ష్యం చెప్పి శిక్ష ఖరారు చేయాలే తప్పా హింసించడము తగదన్నారు.అనారోగ్యంతో కుమిలిపోతున్న శ్రీను బాధను చూసిన తన తల్లి సావిత్రమ్మ ముసలితనంలో కొడుకు కోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ దీక్షకు దిగిందన్నారు.దీనిని ఓర్వలేని ప్రభుత్వం భగ్నం చేయమని ఏ చట్టం చెబుతోందని ద్వజమెత్తారు.శ్రీనుకి బెయిల్ వెంటనే ఇవ్వాలి.లేదంటే కేసు విచారణ వేగవంతంగా జరపాలని డిమాండ్ చేశారు.నా ఎస్సీ,ఎస్టీలని రోజులో పదుల సార్లు పలికే ముఖ్యమంత్రి ఇదేనా ఎస్సీ,ఎస్టీలకు ఇచ్చే గౌరవమని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా శ్రీను న్యాయం చేయాలని లేదంటే ఎస్సీ,ఎస్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో జే,ఏ,సీ మండల ఉపాధ్యక్షుడు కురాకుల పల్లి గోపాల్.ప్రధాన కార్యదర్శి ఓంటరెడ్డి పల్లి నాగరాజు.నారాయణ స్వామి.ఓబులేసు.గోవింద్.బాలు.తదితరులు పాల్గొన్నారు.
దళితులంటే జైలల్లో మగ్గాల్సిందేనా..?డాబా రమేష్
RELATED ARTICLES