భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించి జమేదార్ బంజర్, పార్కలగండి, బాలరాజుగూడెం, జగ్గారం, అంకంపాలెం, ఆర్లపెంట, పూసుకుంట గ్రామాల్లో రూ. 1,49,20,000 విలువైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రవాణా సౌకర్యాల మెరుగుదలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని తెలిపారు.
అనంతరం, ఆయన స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామాల్లో పలు కుటుంబాలను వ్యక్తిగతంగా పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
దమ్మపేటలో 1.49 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
RELATED ARTICLES