TEJA NEWS TV HINDUPUR :
హిందూపురం పట్టణంలోని పరిగి బస్టాండ్ నందు తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకుంటున్న వారికి న్యాయం చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ,కు వినతి పత్రం అందజేశారు.
ఈసందర్భంగా ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తోపుడుబండ్ల ద్వారా జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారస్తులకు వెంటనే తగు న్యాయం చేయాలని మున్సిపల్ కమిషనర్ ,కి వినతి పత్రం అందించి తెలిపారు. దాదాపు 200 మంది పరిగి బస్టాండ్ సమీపంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వారికి అక్కడే వారి వ్యాపారాలు కొనసాగే విధంగా హిందూపురం మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వాలని కోరారు.అలాగే గత 50 సంవత్సరాల నుండి ఈ పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని బాధితులు కమిషనర్, కు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ముత్యాలప్ప, సురేష్ మరియు తోపుడుబండ్ల వ్యాపారస్తుల సంఘం నాయకులు ముజీబ్, ఇక్బాల్,అసాద్, సైఫుల్లా, వేంకటేశ్, ఫయజ్,మునీర్, ఫకృద్దీన్, తదితరులు పాల్గొన్నారు.