వరదయ్యపాలెం తిరుపతి జిల్లా
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు,మాజీ ముఖ్య మంత్రి,తెలుగు జాతి ఆరాధ్యుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారకరామారావు 28వ వర్ధంతి వేడుకలను తెలుగు దేశం పార్టీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గురువారం బస్టాండ్ ఆవరణలో తెలుగుదేశం జెండా వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ మండల అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి,అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్వచ్ఛమైన రాజకీయాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని,తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింప జేసిన నేతని వివరించారు.రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతినిధిగా ఖ్యాతినార్జించారని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుబడిన మహానేత నందమూరి తారక రామారావు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.తెలుగు తెరకు మకుటం లేని మహారాజు ఎన్టీఆర్ అని, సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసి పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో అధికారం చేపట్టి రికార్డ్ లో స్థానం సంపాదించుకున్న ఘనత ఆయనకే దక్కుతుందని యుగంధర్ రెడ్డి వెల్లడించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇంచార్జిలు నిర్మల్,కుమార్,మండల సీనియర్ నాయకులు,జనసేన నాయకుడు తడ శ్రీను,తెలుగు దేశం పార్టీ అభిమానులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి
RELATED ARTICLES