TEJA NEWS TV :
నిన్నటి రోజున 100 మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందలేదని AISF TNSF కథనం మేరకు
స్పందించిన జిల్లా కలెక్టర్ డా,సృజన మేడం
AISF–TNSF–విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాడుతాం-✊-✊
జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు హోళగుంద జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా DEO కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ (AD) శ్యామ్యూల్ పాల్.
ఈ సందర్భంగా పాఠశాల తనిఖీకి వచ్చిన జిల్లా (AD) అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామ్యూల్ పాల్.గారికి AISF TNSF మండల నాయకులు పాఠశాలలో నెలకొన్న సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా AISF —TNSF.విద్యార్థి సంఘాల నాయకులు ఇచ్చిన సమస్యలు
1.విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించాలి.
2.విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం వడ్డించాలి.
3 పాఠశాలలో అపరిశుభ్రంగా ఉన్న ఆవరణాన్ని శుభ్రపరచాలి.
4 విద్యార్థులకు త్రాగునీరు సమస్య లేకుండా చూడాలి అదేవిధంగా బాత్రూంలో టాయిలెట్ రూమ్ లు కూడా శుభ్రపరచాలి.
ఈ సమస్యలపై సానుకూలంగా జిల్లా అధికారులు స్పందిస్తూ.
ఈ పాఠశాలకు నూతనంగా 16 మంది ఉపాధ్యాయులను నియమిస్తామని. మధ్యాహ్న భోజనంలో ఇంకోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటాం అపరిశుభ్రంగా ఉన్న పాఠశాల ఆవరణాన్ని శుభ్రం చేయిస్తాం. విద్యార్థులకు త్రాగునీరు సమస్య లేకుండా చూస్తాం అదేవిధంగా బాత్రూంలో టాయిలెట్ రూమ్ లో కూడా శుభ్రం చేస్తామని చెప్పడం జరిగింది ఈ సమస్యలను జిల్లా కలెక్టర్ గారికి జిల్లా డీఈఓ గారి దగ్గరికి కూడా తీసుకెళ్లి పరిష్కరిస్తామని.హామీ ఇవ్వడం జరిగింది.