భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
2-06-2025
చండ్రుగొండ, జూ2.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్నవారి త్యాగ ఫలితంగా స్వరాష్ట్రం సాధ్యమైందని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల జేఏసీ మండల అధ్యక్షులు గాదె లింగయ్య, కార్యదర్శి ఎస్.కే. జాఫర్‌లు పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చండ్రుగొండ మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
“ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలను తట్టుకోలేక విద్యార్థులు, మేధావులు, కళాకారులు, యువత ఉద్యమబాట పట్టారు. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు పోరాడారు. ఈ స్వరాష్ట్రం వారి త్యాగాలకు నిదర్శనం,” అని అన్నారు.
అమరవీరుల ఆశయాల సాధనకై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ, వారు కొన్ని ముఖ్యమైన డిమాండ్లను ప్రస్తావించారు:
ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి
నెలవారీ పెన్షన్ అందించాలి
ఇంటి స్థలాలు, నిర్మాణ నిధులు ఇవ్వాలి
హెల్త్ కార్డులు ద్వారా ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలి
కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు గార్లపాటి రామనాథం, రామిశెట్టి సైదయ్య, శ్రీరాం రమేష్, బడికల శ్రావణ్ కుమార్, నరుకుల్ల వాసు, చిన్న పిచ్చయ్య, ఆకుల శ్రీను, జాకీర్, గఫార్, యాకయ్య, నాభీద్, అబ్బాస్ అలీ, ముస్తఫా, జిలాని, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
.
తెలంగాణ స్వరాష్ట్రం అమరుల త్యాగ ఫలితమే ఉద్యమకారులకు గుర్తింపు కల్పించాలి: లింగయ్య, జాఫర్
RELATED ARTICLES