తేజ న్యూస్ టివి ప్రతినిధి
హైదరాబాదులోని ముఖ్యమంత్రి నివాసంలో ఆదివారం రోజు మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డి ని కలిసిన వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పేరుమాండ్ల రామకృష్ణ. ముఖ్యమంత్రి. కి సన్మానం చేసి అభిమాన పూర్వకమైన జ్ఞాపికను అందించడం జరిగింది. డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ కష్టపడే ప్రతి కార్యకర్తను పార్టీ లో అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తు మరియు నిత్యం నాకు తోడుగా ఉంటు నాకు ఆశీస్సులు అందచేసిన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు . వరంగల్ ఎంపి టికెట్ కూడ తప్పకుండా కటాయిస్తారని పూర్తి నమ్మకం రేవంతన్న మీద ఉందన్నారు . ముఖ్యమంత్రి అధ్వర్యంలో ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు . మొదటి నుండి కూడా నేను రేవంతన్న పీసీసీ కాకముందు నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయసాధనలో బావస్వాములమయ్యాము అదేవిధంగా పూర్తిగా కాంగ్రెస్ నాయకులు ప్రజలు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ చేస్తున్నారని , మంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోనడిపిస్తూ నిరిపిస్తున్నారన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వల్లాల జగన్ మహేష్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ (ఎంపి ఆస్పిరెంట్)
RELATED ARTICLES