Monday, November 17, 2025

తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రధానమంత్రికి లేఖ – మద్దిశెట్టి సామెలు కు ప్రధానమంత్రి కార్యాలయం స్పందన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం:

: 14-10-2025



తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, ఉద్యోగ మరియు ప్రజా సంక్షేమ సమస్యలపై భారతీయ యువ సేవా సంఘ్ జాతీయ అధ్యక్షులు శ్రీ మద్దిశెట్టి సామెలు  భారత ప్రధానమంత్రి కి ఒక వినతిపత్రం సమర్పించారు.

ఈ వినతిపత్రం PMOPG/D/2025/0190840 నంబర్‌తో 09-10-2025న ప్రధానమంత్రి కార్యాలయంలో నమోదు చేయబడింది.

తక్షణమే స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం (PMO), ఈ ఫిర్యాదును తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సాధారణ పరిపాలన శాఖ) ద్వారా హోం శాఖ, తెలంగాణ సచివాలయం, హైదరాబాద్ కు అవసరమైన చర్యల కోసం పంపింది. ఈ కేసు 13-10-2025 న అధికారికంగా పరిష్కరించబడినట్లు రికార్డుల ప్రకారం తెలియజేయబడింది.

ఈ కేసుకు సంబంధిత అధికారి గా శ్రీ జె. అరుణ్ కుమార్, అదనపు కార్యదర్శి (GAD), నియమితులయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ మద్దిశెట్టి సామెలు  ప్రధానమంత్రి కార్యాలయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే స్పందించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.




✍️
మద్దిశెట్టి సామెలు
జాతీయ అధ్యక్షులు, యువ మోర్చా
భారతీయ యువ సేవా సంఘ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular