భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
19-2-2025
కొత్తగూడెం:
ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో, తెలంగాణలో అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసిన TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు ను తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కిని నరసింహులు , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు అరవింద్ కుమార్ గౌడ్ , నన్నూరి నర్సిరెడ్డి తదితరులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అభినందించారు.
ఈ సందర్భంగా, ఆయనకు సన్మానం చేసి మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో TNTUC రాష్ట్ర ప్రచార కార్యదర్శి గల్లా నాగభూషయ్య, పినపాక తెలుగుదేశం పార్టీ నాయకులు వట్టమ్ నారాయణ దొర, వాసిరెడ్డి చలపతిరావు, సహా పినపాక, బూర్గంపహాడ్ మండలాల తెలుగుదేశం పార్టీ & TNTUC నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధినాయకుల నుండి పోటు రంగారావు కి అభినందనలు
RELATED ARTICLES