భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుచుపల్లి మండలంలోని అమరజీవి కామ్రేడ్ చంద్ర సత్యనారాయణ సీతా మనోహర మెమోరియల్ సిపిఐ మీటింగ్ హాల్లో జరిగిన జరిగిన జర్నలిస్ట్ మీడియా యూనియన్ సమావేశం. రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్ తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ ఎన్ యు జె ఐ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు రాజ్ బిహారీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించినారు.
జీవిత బీమా అక్రిడేషన్ కార్డు లు ఇళ్ల స్థలాలు జర్నలిస్టులపై అక్రమాలు కేసులను పలు రకాల సమస్యలపై సానుకూలంగా వున్న ఆయన టి జే ఏం యూ యూనియన్ కి నేషనల్ యూనియన్ ఎన్ యూ జే ఐ అనుబంధంగా ఇప్పటి నుండి తెలంగాణా కి మద్దతుగా వుంటుందని అయన ప్రసంగించినారు.
ఈ సమావేశములో జాతీయ ఉపాధ్యక్షులు పొన్నం రాజ్ మాట్లాడుతూ పాత్రికేయులందరూ ఐక్యంగా ఉండాలని కలిసి కట్టుగా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఏపీ జనరల్ సెక్రెటరీ యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీజేఎంయు బలంగా రాష్ట్రవ్యాప్తంగా తయారు చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం సమావేశంలో తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన అధ్యక్షులు కురుపెల్లి శంకర్
మాట్లాడుతూ దేశం లో 22 రాష్ట్రాలకు అనుబంధంగా పని చేయుచున్న ఎన్ యు జె ఐ సంస్థలో ఈ రోజు నుంచి టీజేఎంయు కలిసి పనిచేస్తుందని రాబోవు రోజుల్లో టీజే ఎంయు యూనియన్ మరింత ముందుకు పోయి విలేకరుల సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తుందని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీజేఎంయు జిల్లా అధ్యక్షుడు కురుపల్లి శంకర్ జిల్లా ఉపాధ్యక్షుడు కత్తి బాలకృష్ణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా జక్కుల పాల్గొనను నియమించడం జరిగింది.