
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారి ఆధ్వర్యంలో సంగెం మండలం చింతలపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన ఆర్థిక అక్షరాస్యత సదస్సు మహిళలకు
ఏర్పడడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
రిజర్వ్ బ్యాంకు జనరల్ మేనేజర్ శ్రీ ముత్యాల జ్ఞాన సుప్రభాత్, మాట్లాడుతూ ఆర్థిక అక్షరతపైన అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్క ఖాతాను రెన్యువల్ చేసుకోవాలి ఇన్సూరెన్స్ ద్వారా అనేకమంది కుటుంబా లకు భరోసా ఉంటుంది అని అన్నారు, ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ద్వారా బ్యాంకు ఖాతా పైన ఇన్సూరెన్స్ చేయడం జరిగింది,జున్న రమేష్ ఇటీవల మరణించడం జరిగింది,వారి నామిని భార్య జున్న సరిత కు 2 లక్షల చెక్కును టీజిబి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా అందజేయడం జరిగింది.రిజర్వ్ బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీమతి తాన్య సంగ్మా, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ రాజు, డిఎంఎఫ్ఐసి శ్రీనివాస్,టిజిబి బ్యాంకు మెనేజర్ సుల్తాన్ వెంకయ్య, యుబిఐ బ్యాంకు మేనేజర్ చందు, ఎఫ్ఎల్ సి సి టి భాస్కరాచారి, ఎల్ డిఎం ఆఫీస్ రవి, సీసీ బొజ్జ సురేశ్, వివోఏలు మంజుల, ప్రవీణలత, మాజీ ఉపసర్పంచ్ రాధిక, టిజిబి,యుబి ఐ బ్యాంకు మిత్రలు, మహిళలు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.



