సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి.
తెలంగాణ రాష్ట్రంలోని
ప్రభుత్వ కళాశాలల కోసం అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కోదాటి శ్రీధర్ అన్నారు.మంగళావారం రోజున తెలంగాణా గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్-475 నూతన సంవత్సర_2024 గోడ పత్రికను సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కోదాటి శ్రీధర్ ఆధ్యర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ శ్రీధర్ మాట్లాడుతూ…తెలంగాణా రాష్ట్రంలో గత 20 సంవత్సరాల నుండి ప్రభుత్వ విద్య బలోపేతానికి సంఘ పరంగా అందిస్తున్న సేవలను కొనియాడారు.అదేవిదంగా జిల్లాలో ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలనీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ స్టేట్ కౌన్సిలర్ మామిండ్ల బుచ్చిరెడ్డి,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాత్రి నాగరాజు,అనిల్ కుమార్,పవన్ కుమార్,కుమారస్వామి,యాక సాయిలు,కుమారస్వామి,అక్రమ్ అలీ,సంఘసభ్యులు,తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ.
RELATED ARTICLES