
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
అశ్వరావుపేట మండలం
2-06-2025 అశ్వారావుపేట:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు జారె ఆదినారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె మాట్లాడుతూ,
“తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన యోధుల త్యాగాలు మరువలేనివి. వారి త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకం. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది” అని తెలిపారు.
వేదికపై ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనవంతం చేశారు.