భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం:
ఫిబ్రవరిO5. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ముందు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించడం మాలలకు అన్యాయంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొప్పరి నవతన్, పగిడిపల్లి శ్రీకాంత్, పి.ఎన్. మూర్తి, వాసుమల్ల గౌతమ్, బద్దం రాహుల్, దాసరి అశోక్, పండగ రాజేశ్వరరావు, గంధం కల్పన, బద్దం స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించడం మాలలకు అన్యాయంగా ఉంది – పూల రవీందర్
RELATED ARTICLES