తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవంను నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలను జారీ చేసింది. ఈ సందర్భంగా చేగుంట మండల కేంద్రంలో మంగళవారం నాడు ప్రభుత్వకార్యాలయలో, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం, తాసిల్దార్, కార్యాలయం, గ్రామపంచాయతీ వద్ద, జాతీయ జెండాను ఎగరవేశారు. ఈసందర్భముగా వారు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవంను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం వలన ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాలను అర్హులైన వారికి లబ్ధి చేకూర్చడంలో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.