ఐఎండి అధికారుల తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మండలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తిరుపతి జిల్లా వరదయ్యపాలెం ఎస్ ఐ నాగార్జున రెడ్డి తెలిపారు.
భారీ వర్షాల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, పూరి గుడిసెల గోడల వద్ద అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నీరు ఉధృతిగా ప్రవహించే సమయంలో వంకలు, వాగులు దాటునప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంకలు, వాగులు వద్ద ఏదైనా ప్రమాదం జరిగే సూచనలు ఉన్నా తమకు తెలియజేయాలని.వరదయ్యపాలెం ఎస్సై నాగార్జున రెడ్డి ప్రజలను కోరారు.
తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి – ఎస్సై నాగార్జున రెడ్డి విజ్ఞప్తి
RELATED ARTICLES