తుపాన్ ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. మూడు రోజుల పాటు తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటకి పంపద్దు
వాగులు వంకలు కాలువలు పొంగిపొర్లుతున్నoదున ప్రజలు ఇంటికే పరిమితం కావాలి.వరదయ్యపాలెం_ సంతవేలూరు, పాండురు, కడురు మార్గంలో వాగుల ఉదృతికి రాకపోకలు స్తంభించినందున ఆ గ్రామీణప్రాంత ప్రజలు ప్రయాణం చేయద్దు.వరదయ్యపాలెం మండలంలో తుపాన్ ప్రభావం కారణంగా ఎస్సై నాగార్జునరెడ్డి వరద ప్రభావ ప్రాంతాలలో పర్యటించి వరద తీవ్రతను పరిశీలించారు. ప్రమాదకర వాగుల వద్ద రాకపోకలకు అడ్డుగా కంచే ఏర్పాటు చేశారు.వరదయ్యపాలెం_ సంతవేలూరు, కడురు, పాండురు_సిద్దేశ్వరపురం మార్గంలో వాగుల ఉదృతికి వాహన రాకపోకలు స్తంభించినందున ఆ గ్రామీణప్రాంత ప్రజలు ప్రయాణం చేయద్దని ఎస్సై పిలుపునిచ్చారు.
పలు గ్రామాల్లో వాగులు వంకలు కాలువలు పొంగిపొర్లుతున్నoదున ప్రజలు ఇంటికే పరిమితం కావాలని ఎస్సై కోరారు.తల్లిదండ్రులు మూడు రోజుల పాటు తమ పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్సై నాగార్జున రెడ్డి కోరారు.ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తమకు సమాచారం అందించాలని ఎస్సై నాగార్జున రెడ్డి కోరారు.
ఫోన్ నెం.+919440900725
తుపాన్ నేపథ్యంలో వరదయ్యపాలెం ఎస్సై నాగార్జున రెడ్డి హెచ్చరిక
RELATED ARTICLES