Friday, January 24, 2025

తుంగతూర్తిలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు


తుంగతుర్తి ప్రతినిధి  ఏప్రిల్ 11 (తేజ న్యూస్ )
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని మండల కేంద్రంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక ఈద్గాలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ మేరకు మత పెద్ద  అబ్దుల్ ఆహాద్ ఖురాన్ పఠనం  చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం  ఒకరినొకరు ఆ లింగణం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ. సోదర భావం. శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినం అని అన్నారు. 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్ష నుండి అల్లా యొక్క అనుగ్రహం పొందుతారని తెలిపారు. ఆ దేవుడి చల్లని దీవెనలతో చక్కగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజల సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్న ఈద్గా దగ్గరికి డిజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొండగడుపుల ఎల్లయ్య. రాష్ట్ర కమిటీ సభ్యులు ఓరుగంటి శ్రీనివాస్, డిజేఎఫ్ మండల అధ్యక్షుడు గుండగాని రాము  తదితరులు ముస్లింలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు అన్వర్. ఉస్మాన్. మజీద్. యాకూబ్.దస్తగిరి  అబ్దుల్. అమీర్. భాష. మీరా సాబ్. నజీర్. రఫీక్. అల్లి సాబ్. జాన్. లాల్ తో పాటు ముస్లిములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular