తుంగతుర్తి ప్రతినిధి ఏప్రిల్ 11 (తేజ న్యూస్ )
దేశంలోనే సమ సమాజ స్థాపన కృషి చేసిన మహానీయుడు సంఘసంస్కర్త జ్యోతిరావు పూలేనని ఆయన ఆశయాలు సాధించుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి సత్యనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోపూలే జయంతి కార్యక్రమంలో భాగంగా వివిధ పార్టీ నాయకులు, సంఘ సేవకులు, విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో భిన్న జాతులు కులాలు ఉన్నప్పటికీ సమ సమాజ స్థాపన కోసం ఆహార్నిశలు కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనాలు యువత ముందుండి పోరాటం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు, పెద్ద బోయిన అజయ్, , కొండా రాజు, రాంబాబు యాదవ్, గంగరాజు యాదవ్, మాచర్ల అనిల్, శ్రీను, రమేష్, అక్కినపల్లి నరేష్ ,ముత్యాల వెంకన్న, ఎనగందుల సంజీవ, బింగి అచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి: సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహానీయుడు పూలే – జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి సత్యనారాయణ
RELATED ARTICLES