Monday, February 10, 2025

తుంగతుర్తి: ఎన్నికల కోడ్ ఉన్న… జోరుగా బెల్ట్ షాపుల నిర్వహణ



గ్రామాల్లో జోరుగా నడుస్తున్న…. పట్టించుకోని ఎక్సైజ్ ,పోలీస్ అధికారులు..

గ్రామాల్లో కిరాణం షాపు యజమానులకు… వృత్తిగా మారిన వైనం

మామూళ్ల మత్తులో… నడిపిస్తున్నారని వివిధ పార్టీ నాయకుల విమర్శలు.


( తుంగతుర్తి తేజ న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 7 )

దేశంలోనే ఉన్నతంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒక ప్రక్క ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ మరొక ప్రక్క ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో తుంగతుర్తి లోని బెల్ట్ షాపుల్లో మద్యం అధిక ధరలతో ఏరులై పారుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని.. చుట్టపు బంధువులుగా వచ్చి.. అడప, తడప కేసులు అధికారులు నమోదు చేస్తున్నారని.. వివిధ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.


పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తుంగతుర్తి ఎక్సైజ్ శాఖ పరిధిలోని అన్ని మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుంది.
ను అరికట్టాల్సిన ఎక్సైజ్ పోలీసులు వైన్ షాప్ లు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో కిరాణా షాపుల్లో శీతల పానీయాల తోడుగా, బెల్ట్ షాపుల మాదిరిగా పుట్టగొడుగుల వేలుస్తున్నాయి. బెల్టుషాప్ యజమానులు తమ జేబులు నింపుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు  జరుపుతున్నారు. గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్ట్ షాపులు  తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు సమయం ఎంతైనా మద్యం దొరుకుతుంది. పగలు రాత్రి తేడా అనేది లేకుండా ఆయా మండల కేంద్రంలోని వైన్ షాప్ ల నుండి ఆటోలలో కొనుగోలు చేసిన మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లోని బెల్ట్ షాపులు ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. ఇళ్ల మధ్యలోనే ఇట్టి అమ్మకాలు కొనసాగుతున్నాయి. మహిళలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన అధికారుల అండదండలతో కొనసాగుతున్నాయి. చాలా గ్రామాల్లో కిరాణా షాపు ముసుగులో ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులు అమ్ముతూ మరోపక్క మద్యం సీసాలు అధిక రేట్లకు అమ్ముతూ మందుబాబుల జేబులు గుల్ల చేస్తున్నారు.. ముఖ్యంగా యువత మద్యానికి చెడు అలవాట్లకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము బెల్ట్ షాపు యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు.

పట్టించుకోని ఎక్సైజ్  అధికారులు..

ముఖ్యంగా ఎన్నికలవేళ గ్రామాల్లో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టాల్సిన పోలీస్ శాఖ చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఈ దందా యదేచ్చగా కొనసాగుతుంది. ప్రతి  మండలంలో దాదాపుగా 200 పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. వైన్ షాపులు సిండికేట్ గా ఏర్పడి తాను ఇష్టాను రీతిలో నిబంధనలు విరుద్ధంగా గ్రామాలలో బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు.బెల్ట్ షాపుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. మరింత ఆదాయం పెంచుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వము బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో మహిళల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో తుంగతుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో  కోట్ల రూపాయలలో అమ్మకాలు జరుగుతున్నాయి. వైన్స్ యజమానులు ఎక్సైజ్ అధికారుల  అండదండలతో ప్రతి మండలంలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. పైకి మాత్రం పేరుకు కిరాణా షాప్ నడుస్తున్న లోపల మద్యం అమ్మకాలు  కొనసాగిస్తున్నారు మరోపక్క గ్రామాలలో ఉన్న బెల్టు షాపులపై దాడులు చేయవద్దని అందుకు ప్రతిగా ప్రతి నెల ఎక్సైజ్ సిబ్బందికి మరియు పోలీస్ శాఖకు డబ్బులు ఇస్తున్నట్లు సమాచారం. పేరుకు మాత్రం ఎక్సైజ్ సిబ్బంది అడపాదడపా తూతూ మంత్రంగా దాడులు జరిపి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రోజురోజుకు గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా సాగుతుండడంతో సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు పోలీస్ శాఖ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాప్ లను అరికట్టి గ్రామాలు శాంతియుతంగా ఉండేటట్లు చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular