TEJA NEWS TV : సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు కొత్తతరహా మోసాలు
సైబర్ నేరగాళ్ల చేతుల్లో శ్రీ సిటీ కాల్ గేట్ కంపెనీ ఎంప్లాయ్ అమాయకుడు పి నాగార్జున
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో చోటుచేసుకుంది ,ఇతను శ్రీ సిటీ కాల్ గెట్ కంపెనీ ఎంప్లాయ్ పాల్పడుతున్నారు. ఫ్రీ క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు టైమ్ అయిపోయిందంటూ కాల్ చేయడం ఇలా మోసాలు కూడా అధిక సంఖ్యలో పెరుగుతున్నాయి. అమాయకమైన ప్రజలను మోసం చేయడానికి సైబర్ మోసగాళ్లు ఎలాంటి మార్గం వదలిపెట్టడం లేదు.సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా ప్రజలు మాత్రం నేరగాళ్ల ఉచ్చులో పడిపోతూనే ఉన్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలతో పాటు ఓటీపీ ఎవరికీ చెప్పకూడదని సూచిస్తున్నా.. వాటిని లైట్ తీసుకుంటుండటంతో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయి.పోలీసులు ఎంత అవగాహన కల్పించినా అది అవగాహనకు మాత్రమే పరిమితమవుతున్నాయి.
క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ అంటూ కాల్ చేసి వేల సంఖ్యలో డబ్బులు కాజేశాడు కేటుగాడు. ఈఘటన తిరుపతిజిల్లా వరదయ్యపాలెం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వరదయ్యపాలెం మండలం ఇంద్రనగర్ పంచాయతీ పద్మావతి పురం గ్రామంకు చెందిన నాగార్జున శ్రీ సిటీ లోని కోల్గేట్ కంపెనీ నందు ఉద్యోగం చేస్తున్నాడు. సైబర్ నేరగాళ్లు ఇతనికి క్రెడిట్ కార్డు సమయం పూర్తయిపోయిందని క్రెడిట్ కార్డ్ యొక్క సమాచారం తెలియజేయాలని కాల్ చేయడంతో క్రెడిట్ కార్డు కదా అని భావించి పూర్తి సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు తెలియచేశాడు.అంతేకాక తన మొబైల్ కు వచ్చిన
ఓటీపీ చెప్పమని అడగడంతో ఓటీపీ చెప్పాడు అంతే ఓటీపీ చెప్పడమే ఆలస్యం బ్యాంక్ అకౌంట్ లో నుంచి 75 వేల రూపాయలు మాయమైపోయాయి. నాగర్జునకు డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ రావడంతో షాక్ తిన్నాడు.అతను సమాచారం కోరగా కంపెనీకి టైం అయిపోతుందని హడావిడి బస్సు ఎక్కడముతో ఫోన్ రావడంతో ఐసిఐసిఐ బ్యాంక్ వారు ఫోన్ చేశారేమో అనుకుని సమాచారం ఇచ్చానని తెలిపాడు మళ్లీ అదే నెంబర్ కు కాల్ చేయగా రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయానని భావించిన నాగార్జున సైబర్ క్రైమ్ నెంబర్ 1903 కి ఫిర్యాదు చేశాడు. అనంతరం వరదయ్యపాలెం పోలీస్ స్టేషన్ ఎస్సై నాగార్జున రెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తిరుపతి జిల్లా: సైబర్ నేరగాళ్ల చేతుల్లో శ్రీ సిటీ కాల్ గేట్ కంపెనీ ఎంప్లాయ్ అమాయకుడు పి నాగార్జున
RELATED ARTICLES