TEJA NEWS TV :
75వ గణతంత్ర వేడుకలను ఎంపీపీ పాఠశాల ,అంబూర్ వైసి నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్నె.ఋష్యేంద్రబాబు ఆధ్వర్యంలోఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ అంబూరు సుబ్రహ్మణ్యం గారు మరియు ముఖ్య అతిథులుగా ఆణిముత్యం నందకిషోర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా అంబుర్ సర్పంచ్ మామిడిపూడి సాయి రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి గురించి వివరిస్తూ పిల్లలు ఏ విధంగా అభివృద్ధి పథంలో పయనించాలనే విషయాన్ని తెలియజేశారు. అంబుర్ సర్పంచ్ సాయి రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు అవసరమైనటువంటి బాలిక వసతుల కల్పనలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ముఖ్య దాత ఎన్నారై విద్యావేత్త అయినటువంటి ఆణిముత్యం నందకిషోర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ప్రయోజనాలను పొందుతూ చదువులో ఉన్నతంగా రాణించి ఉజ్వల భవిష్యత్తుకి పునాదులు వేసుకోవాలని పిల్లల ఉద్దేశించి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆణిముత్యం నందకిషోర్ రెడ్డి 17 వేల రూపాయలు విలువచేసే ఆఫీస్ టేబుల్ ను, క్రీడా సామాగ్రిని మరియు బోధనోపకరణాలను అందించడం జరిగింది. మరొక దాత ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు 13000 రూపాయలు విలువ చేసే కలర్ ప్రింటర్ను పాఠశాలకు వితరణ చేయడం జరిగింది. మరియు సర్పంచ్ సాయి రెడ్డి గారు పిల్లలకు నోటు పుస్తకాలను బోధనాపకరణాలను అందించడం జరిగింది. చివర్లో పిల్లలకు స్వీట్స్ మిఠాయిలు పంచిపెట్టారు. దాతలు అందరినీ కీర్తిస్తూ ,వారి సేవలు మర్చిపోలేము ,అని ఇదే విధంగా తమకు పాఠశాల అభివృద్ధికి భవిష్యత్తులో సహాయపడి పిల్లలకు మంచి వసతులు కల్పించేలా కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులు కోరుకున్నారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు మనోజ్ కుమార్ అంగన్వాడి టీచర్ కళావతి మరియు దొడ్డి మునిరాజు ,విద్యా వాలంటీర్ వత్సల, విద్యా కమిటీ సభ్యులు,గ్రామస్తులు పాఠశాల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా: వరదయ్యపాలెంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES