Wednesday, January 22, 2025

తిరుపతి జిల్లా: పురావస్తు శాఖ వారి నుండి కాపాడండి – సిపిఐ ఆధ్వర్యంలో గిరిజనుల ధర్నా



వరదయ్య పాలెం, తిరుపతి జిల్లా

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం పాండూరు పంచాయతీలోని ముట్టంగి తిప్ప గిరిజనులు సుబ్బానాయుడు కండ్రిక రైతులు చెన్నై పురావస్తు శాఖ వారి దౌర్జన్యం నుండి మమ్మల్ని కాపాడండి తహసిల్దార్ ఆఫీస్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సత్యవేడు  నియోజకవర్గ కార్యదర్శి ఆంభాకం చిన్ని రాజ్ మాట్లాడుతూ దెబ్భై ఐదు క్రితంసంవత్సరాల క్రితం సంబంధిత భూములు అన్ని చెన్నైలోని పురావస్తు శాఖకు ఇచ్చారని ఆ భూమి చుట్టూ ప్రహరీ గోడ కట్టడానికి పురావస్తు శాఖ వారికి అధికారం ఉందని ఆ ప్రాంత గిరిజనులు మరియు రైతులపై రోజు దౌర్జన్యానికి దాడులకు పూనుకుంటున్నారని పురావస్తు శాఖ వారి నుండి గిరిజనులను రైతులను రక్షించే కాపాడాలని చిన్ని రాజ్ డిమాండ్ చేశారు
గతంలోతొమ్మిది నెలల క్రితం పురావస్తు శాఖ వారు జెసిబిలను టిప్పర్లను ఇసుక కంకరు తీసుకొని వచ్చి గోతులు తీయడం జరిగింది అప్పుడు సిపి ఆధ్వర్యంలో గిరిజనులు రైతులు అడ్డుకొని తాసిల్దార్ ఆర్డీవో కలెక్టర్ ఆఫీసుల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఆ భూములను రికార్డులను ఆర్డిఓ గారు పరిశీలించడం జరిగింది ఆ భూములలో గిరిజనులకు నివాస పట్టాలు బోర్లు విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగిందని ఆ భూములలో జగనన్న ఇల్లు ప్రాథమిక పాఠశాల అంగన్వాడి పాఠశాల ప్రభుత్వమే నిర్మించి ఉండడం చూశారు అలాగే ఆ భూములలో వెనకబడిన తరగతుల వారైనా కొంతమంది రైతులకు అసైన్మెంట్ పట్టాలి ఇవ్వడం వాళ్ళందరూ సాగు చేసుకుంటు న్నారని ఆర్డీవో గారు ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఆర్డీవో గారు ఆ సందర్భంగా రైతులతోనూ గిరిజనులతో ప్రజలందరితో మాట్లాడుతూ మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఇళ్ల పట్టాలు రైతులకు పట్టాలు ఇచ్చినవన్నీ కూడా రెవెన్యూ రికార్డులు నమోదు ఉన్నాయని పై అధికారులకు నివేదిక సమర్పించి మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందిని ఈ సందర్భంగా చిన్ని రాజు తెలిపారు అయితే 9 నెలలు గడిచిన తర్వాత పురావస్తు శాఖ వారు నిన్నటి దినం వచ్చి మేము గోతులు తీస్తాము ప్రహరీ గోడలు కడతాము అని పోలీసులను జెసిబి ఇతర సామాగ్రి మిషనరీ అంతా తీసుకుని వచ్చి గిరిజనులపై పేద రైతులపై దౌర్జన్యం చేస్తున్నారని ఇది చాలా దుర్మార్గపు చర్య అని చిన్ని రాజు ఆవేదన వ్యక్తం చేశారు సాగు భూమి పట్టాలు జగనన్న  ఇళ్ల పట్టాలు పాఠశాలలు కట్టడానికి అనుమతించిన అధికారులు గిరిజనులకు పేద రైతులకు న్యాయం చేయాలని చిన్ని రాజు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఖాతాని తరుణ్ కుమార్ ఏఐటీయూసీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు చంద్ర తాండూరు ఎంపీటీసీ రమణమ్మ చెన్నయ్య ధనుంజయులు మునస్వామి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular