TEJA NEWS TV :
మద్యం అక్రమ రవాణా చట్టరీత్యా నేరం
సరిహద్దుల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు
తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఎక్సైజ్ సిఐ తిరుపతయ్య నేతృత్వంలో ఎస్ఐ ఫృద్విరాజ్, తమ సిబ్బందితో కలిసి శనివారం వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.తమిళనాడు నుండి ఆంధ్రాకు ప్రయాణిస్తున్న కార్లు, ద్విచక్ర వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ప్రధానంగా దీపావళి పండుగ నేపధ్యంలో కొందరు తమిళనాడు మద్యాన్ని తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాఛారం మేరకు, ఉన్నతాధికారుల ఆదేశాలతో వాహన తనిఖీలు చేపట్టినట్లు సిఐ పేర్కోన్నారు. సిఐ మాట్లాడుతూ మద్యం అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని అన్నారు.మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు చేపట్టడంతో పాటుగా మద్యం అక్రమ రవాణాకు వినియోగించిన వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుందన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎవరైనా అక్రమ మద్యం రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నట్లుయితే సమాఛారం ఇవ్వాలని ఆయన మండల ప్రజలను కోరారు.