Friday, December 12, 2025

తాసిల్దార్ కార్యాలయంలో ట్రైనీ ఐఏఎస్ లకు స్వాగతం పలికిన తాసిల్దార్ నిజాముద్దీన్….ప్రజలకు అందుతున్న సేవలను వివరించిన తాసిల్దార్ నిజాముద్దన్

TEJA NEWS TV



తేజ  న్యూస్ -హొళగుంద మండల కేంద్రంలోని ముస్సోరి లోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ లో ఐఏఎస్ కోర్స్ శిక్షణను పొందిన ట్రైని ఐఏఎస్ లు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా హొళగుంద మండల తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. సోమవారం మధ్యాహ్నం తాసిల్దార్ కార్యాలయానికి విచ్చేసిన ట్రైని ఐఏఎస్ లకు తాసిల్దార్ నిజాముద్దీన్, ఆర్ ఐ మహేష్ గౌడ్, రీ సర్వే డి టీ ముకుందరావు స్వాగతం పలికి వారిని పూలమాలలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు తాసిల్దార్ కార్యాలయం ద్వారా అందుతున్న సేవలను గురించి ట్రైనింగ్ ఐఏఎస్లకు  వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల మంజూరు, భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు, భూమి కొలతలు సరిహద్దుల ఏర్పాటు, యాజమాన్య హక్కుల ధ్రువీకరణ, ఓటర్ కార్డులు తదితర వివరాల గురించి తాసిల్దార్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామాల రెవెన్యూ అధికారులు, సచివాలయ సర్వేయర్లు, వీఆర్వోలు. తలార్లు.కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular