TEJA NEWS TV
మండలంలో రైతుల సమస్యలపై చొరవ చూపండి
బుచ్చినాయుడు కండ్రిగ ఏప్రిల్ 9
తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీదేవిని మండల తెలుగుదేశం నాయకులు కార్తీక్ నాయుడు,మునిచంద్ర నాయుడు, రవి నాయుడు, మధు నాయుడు బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆమెను శాలువా కప్పి పుష్పగుచ్చమిచ్చి స్వీట్స్ ని అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు తహసిల్దార్ తో మండలంలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, అలాగే రేషన్ షాపుల మార్పుల విషయం గురించి, కొత్తగా మంజూరు అవుతున్న ఇళ్లకు పొజిషన్ సర్టిఫికెట్స్ గురించి ఇంకా మండలంలో ఉన్న ఇతర సమస్యలను చర్చించడం జరిగింది. దీనికి తహసిల్దార్ శ్రీదేవి సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని. రైతుల, ప్రజల సమస్యలు తీర్చేందుకే మేమున్నామని భరోసా ఇచ్చారు…
తహసీల్దార్ ని సన్మానించిన తెలుగుదేశం నాయకులు
RELATED ARTICLES