జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అధ్యక్షతన కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో మాజీ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి , జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జరగబోయే ఎన్నికలు ఆషామాషా వి కావని పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణ భవితవ్యాన్ని నిర్ణయించే ఈ ఎన్నికల్లో గతంలా మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారని.. తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో గాలి అనిల్ కుమార్ కేసీఆర్ వెంట నడిచారని.. మంచి వ్యక్తి అని తెలిపారు.
తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది -పోచారం శ్రీనివాస రెడ్డి
RELATED ARTICLES