*అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వుంటూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంట*
*తేజ న్యూస్ టివి ప్రతినిధి.*
ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని ,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ని తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ దిపాదాస్ మున్సిని ఐ ఎన్ టీ యూ సి నేషనల్ చైర్మన్ స్వామీనాథ్ జైస్వాల్ ను కలిసిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ వరంగల్ ఎంపీ ఆస్పరెంట్ వరంగల్ ఎంపీ టికెట్ తనకు టికెట్ కేటాయించాలని కోరగా సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కి కేసి వేణుగోపాల్ కు, దీపాదాస్ మున్సి కి కృతజ్ఞతలు తెలియజేసిన రామకృష్ణ
రామకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ ఇటు ప్రజలకు సేవలు అందిస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని సర్కారు కొలువుకు రాజీనామా చేసి అన్ని వర్గాల బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనునిత్యం వారి మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది అలాగే వరంగల్ పార్లమెంటు పరిధిలో తనకంటూ ఒక గుర్తింపు ఉందంటూ గుర్తు చేశారు గత ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన వారిని ఎదుర్కొని ఎదురు నిలిచి నిలబడ్డానని అన్నారు ఒక ప్రశ్నించే గొంతుకై గత ప్రభుత్వాన్ని చేసే తప్పుల్ని వేలెత్తి చూపుతూ ముందుకు సాగాను ఒక కార్యకర్తగా నన్ను గుర్తించి టికెట్ నాకూ కేటాయించితే ఒక కార్యకర్తకు దక్కిన అవకాశం అని వరంగల్ పార్లమెంట్ ప్రజలందరూ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందపడతారని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వరంగల్ జిల్లా నాయకులు వల్లాల జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో ముఖ్యమంత్రిని కలిసిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ వరంగల్ ఎంపీ ఆస్పరెంట్
RELATED ARTICLES