Friday, January 24, 2025

డోన్: పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

TEJA NEWS TV DHONE

నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన అమ్మ భాష కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను గుర్తుచేసుకుంటూ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నెహ్రూ నగర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డా.సురేష్ బాబు, తెలుగు ఉపాధ్యాయులు దేవేంద్రప్ప మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగంచేసిన చరిత్ర తెలుగువారిదైతే, భాష కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర బంగ్లాదేశ్ ప్రజలదన్నారు. మతం తో సంబంధం లేకుండా బెంగాలీ అంటే బంగ్లా దేశీయులకు తమ భాష అంటే అమితమైన ప్రాణం. అధికసంఖ్యాక ప్రజలు మాట్లాడే ఈ భాషను పక్కన బెట్టి 1948 మార్చి 21న ఉర్దూను దేశానికి ఏకైక అధికారభాషగా ప్రకటించారు. ఆనాటీ పాలకులు ప్రజల నిరసనలు ఉవ్వెత్తున లేచాయి. విద్యార్థులు, మేధావులు మూకుమ్మడి నిరసనలకు దిగినారు. దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీ ని అధికార భాషగా గుర్తించి, ఉర్దూను రెండో అధికార భాషగా చేసుకోవాలని వారు ఒత్తిడి చేసినారు. ప్రభుత్వం వీరి మాట వినలేదు. ఉద్యమాన్ని కర్కశంగా అణచివేయటానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 1952నాటికి భాషోద్యమం తీవ్ర రూపం దాల్చింది.1952 ఫిబ్రవరి 21న బారీ ఆందోళన నిర్వహించాలని డాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు నిర్ణయించారు. సర్కారు అనుమతి ఇవ్వలేదు. 144సెక్షన్ విధించింది. దాన్ని ఉల్లంఘించిన విద్యార్థులను అరస్ట్ చేయించింది ప్రభుత్వం. అయినా ఆరోజు విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. పోలీస్ వారి నిరోధకాలను దాటుకొని తూర్పు బెంగాల్ అసెంబ్లీ భవనానికి చేరుకున్నారు. అందులోకి వెళ్ళటానికి ప్రయత్నించగా,పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. కోన్ని వందల మంది విద్యార్థులు బలైనారు. ఈ మారణ కాండతో భాషోద్యమం రక్తసిక్త మైంది. ఫలితంగా ప్రభుత్వంపై స్థానికుల్లో వ్యతిరేకత తీవ్రమైంది. పాలకులు దిగివచ్చారు.1956లో బెంగాలీని అధికార భాషగా గుర్తించినారు. ఈ విజయానికి తగిన గౌరమిస్తూ…1999 నవంబర్ 17న యునెస్కో ఓ ప్రకటన చేసి, ఫిబ్రవరి 21ని “ప్రపంచ మాతృ భాషా దినోత్సవం”గా జరుపుకోవాలని నిర్ణయించినది.అందుకే ఈ రోజున ప్రపంచదేశాలు వారివారి మాతృ భాషా దినోత్సవాలు జరుపుకుంటారన్నారు. ఈసందర్భంగా సురేష్ బాబు గారికి శాలువా కప్పి పూలమాల తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు రాధ, లీలావతమ్మ, ఆదినారాయణ, భాను ప్రకాష్ రెడ్డి, లక్ష్మయ్య, వెంకట రమణ, సుబ్బారెడ్డి, రవిశేఖర్, వెంకట లక్ష్మీ, అల్లిపీరా, రఘునాథ్, ఎస్తేరమ్మ, మద్దిలేటి, సుబ్బరాయుడు, మధుసూదన్ రెడ్డి, విజయకుమార్, సుభాన్, శ్రీనివాసులు, జయసుబ్బరాయుడు, శివన్న, బాబు, సురేష్,రమేష్, సంజీవరెడ్డి, భారతి, మునిరాజు, ప్రసాద్ రావు మహేష్ అల్లిపీరా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular